` నిర్మాణ కార్మికులతో ముచ్చట, సన్మానం
` జీ`20 నేతల సమావేశానికి అతిథ్యం కోసం నిర్మాణం
` రూ.2,700 కోట్ల వ్యయం
` ఢిల్లీకి ఐకాన్‌గా ‘ఐఈసీసీ’
ఢిల్లీ, న్యూస్‌లీడర్, జూలై 26 : ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే జీ`20 నేతల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న ఢిల్లీలోని రీ డెవలప్డ్ ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ఐటీపీవో) కాంప్లెక్స్‌లో ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రారంభ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిని ప్రగతి మైదాన్ కాంప్లెక్స్ అని కూడా పిలుస్తారు. ఐటీపీవో కాంప్లెక్స్ దాదాపు 123 ఎకరాల క్యాంపస్ విస్తీర్ణంలో ఉంది. ఇది భారతదేశపు అతిపెద్ద ‘ఎంఐసీఈ’ (మీటింగ్‌లు, ప్రోత్సాహకాలు, సమావేశాలు, ప్రదర్శనలు) గమ్యస్థానంగా ఉంటుదని చెబుతున్నారు. ఈ మైదానాన్ని ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు.
ఉదయం 10 గంటలకు ప్రధాని మోడీ హవాన్ పూజతో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నిర్మాణ పనుల్లో పాలుపంచుకున్న కార్మికులను సత్కరించారు. సాయంత్రం 6:30 గంటలకు పీఎం మోడీ జీ20 స్టాంప్, నాణేలను విడుదల చేయనున్నారు. అనంతరం అంటే రాత్రి 7:05 గంటలకు ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
రూ.2700 కోట్లతో నిర్మాణం..
ఈ కాంప్లెక్స్‌లో రూ.2700 కోట్లతో నిర్మాణాలు చేపడుతున్నారు. సంస్కృతి, కళను చాటిచెప్పేలా కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మిస్తున్నారు. ఎగ్జిబిషన్ హాల్ సహా యాంఫీ థియేటర్ మరెన్నో సదుపాయాలు ఇందులో ఏర్పాటు చేయనున్నారు. అంతర్జాతీయ సదస్సులు, ఎగ్జిబిషన్లకు ఆతిథ్యమిచ్చేలా ‘ఐఈసీసీ’ నిర్మిస్తున్నారు. విదేశాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఢల్లీికి ఐకాన్‌గా చెప్పుకోదగ్గ రీతిలో విదేశాలకు ఏమాత్రం తీసి పోకుండా ‘ఐఈసీసీ’ నిర్మాణం ఉంటుందని చెబుతున్నారు.