న్యూ ఢిల్లీ, న్యూస్‌లీడర్, జూలై 26: ప్రముఖ అంతర్జాతీయ స్థాయి బ్రాండ్ ఐటీసీ ఫియామా, భారతదేశంలోని ప్రముఖ పర్సనల్ వాష్ బ్రాండ్లలో ఒకటి. ఫియామా శాండల్‌వుడ్ ఆయిల్ Ê ప్యాచౌలీ జెల్ బార్‌ను మరింతగా వినియోగదారుల వద్దకు తీసుకువెళ్లేందుకు నేషనల్ క్రష్ రష్మిక మందాన్నను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు. ఈ మధ్యకాలంలో ఫియామా శాండల్‌వుడ్ ఆయిల్, ప్యాచౌలీ జెల్ బార్లను ప్రారంభించి… బాత్ సోప్ విభాగంలో సరికొత్త ఆవిష్కరణ దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ఐటిసి లిమిటెడ్పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ బిజినెస్ డివిజన్ డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సమీర్సత్పతి మాట్లాడుతూ, ఫియామా శాండల్ దాని వినూత్న జెల్ బార్ ఫార్మాట్ విశిష్టమైన పదార్ధాల మిక్స్‌తో సరికొత్తగా రూపొందించబడిరదన్నారు. అదే సమయంలో సంప్రదాయాన్ని కాపాడుతూ ఈ సెగ్మెంట్ లో సంచలనం సృష్టిస్తుందని, రష్మిక మందాన్న కూడా నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. రష్మిక శక్తితో ఫియామా శాండల్ ప్రతీ ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుందన్నారు. హీరోయిన్ రష్మిక కొత్త రోజును ఉల్లాసంగా మొదలుపెట్టమని చాటి చెప్తుందని తెలిపారు.