విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూలై 26: కార్గిల్ విజయోత్సవానికి 24ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత నావికాదళం బీచ్‌రోడ్డులో బుధవారం ‘కార్గిల్ విజయ్ దివస్’ నిర్వహించింది. స్వతంత్ర భారత చరిత్రలో మన సైన్యం ఎంతో వీరోచితంగా పోరాడిన ఘట్టాల్ని అందరూ గుర్తు చేసుకోవాలంటూ అధికారులు పిలుపునిచ్చారు. కార్గిల్‌లో పాక్ చొరబాటు దారులు ఆక్రమించిన భారత సైనిక శిబిరాల్ని మన సైన్యం దిగ్విజయంగా చేజిక్కించుకున్న సందర్భంగా ప్రాణాలర్పించిన వారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్గిల్ యుద్ధంలో భారత్ కోసం జూలై 26, 1999న ఎంతోమంది సైనికులు, అధికారులు ప్రాణాలు విడిచిన వారందరికీ జోహార్లు అర్పించి, జై జవాన్ అంటూ నావికాదళ సిబ్బంది సెల్యూట్ చేశారు.