. సాగునీటి ప్రాజెక్టులను అధ్వానం చేశారు . పవర్ ప్రజెంటేషన్‌తో ప్రదర్శన . మాజీ సీఎం చంద్రబాబు ధ్వజం
మంగళగిరి, న్యూస్ లీడర్, జూలై 26: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అజ్ఞానం, మూర్ఖత్వంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సాగునీటి ప్రాజెక్టులే ఓ ఉదాహరణ అని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులు నాశనమైన తీరున ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ‘రాయలసీమ రాళ్ల సీమ కాకూడదంటూ తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి ఊపిరి పోసిన వ్యక్తి ఎన్టీఆర్. దేశంలో ఏ రాష్ట్రానికీ లేని నదీవనరులు మనకు ఉన్నాయి. నదులు అనుసంధానం చేస్తే ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చు. నీటి పారుదలశాఖను నాశనం చేసిన జగన్ సమాధానం చెప్పాలి. సీమకు తీరని ద్రోహం చేసిన పాపం జగన్‌దే’ అని చంద్రబాబు మండిపడ్డారు.