మదనపల్లె గ్రామీణం,న్యూస్ లీడర్, జూలై 26: మదనపల్లె మార్కెట్లో టమాటా ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో టమాటా పంట దిగుబడి తగ్గింది. మదనపల్లె మార్కెట్ పరిధిలో బుధవారం రికార్డు స్థాయిలో కిలో నాణ్యమైన టమాటా రూ.168 పలికింది. మార్కెట్కు రైతులు కేవలం 361 టన్నులు మాత్రమే తీసుకువచ్చారు. మార్కెట్లో ఏ గ్రేడ్ కిలో రూ.140 నుంచి రూ.168, బీ గ్రేడ్ రూ.118 నుంచి రూ.138 వరకు.. సగటున కిలో రూ.132 నుంచి రూ.156 వరకు పలికిందని మార్కెట్ యార్డు కార్యదర్శి అభిలాష్ తెలిపారు. మంగళవారం రూ.140 పలికిన ధర.. ప్రస్తుతం రూ.160కి పైగా పలకడంతో వినియోగదారుల్లో గుబులు మొదలైంది.