పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి చేస్తున్న సినిమా బ్రో. తొలిసారి మామ, అల్లుళ్లు కలిసి నటిస్తుండటంతో, ఈ మూవీపై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ముందు నుంచి ఈ మూవీ పై హైప్ పెంచుతూ వస్తున్నారు. ముఖ్యంగా పవన్‌ని వింటేజ్ లుక్‌లో చూపించడం అందరికీ నచ్చుతోంది. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా, విపరీతంగా నచ్చేసింది. కేవలం పవన్ కోసమే ఈ మూవీచూసేవాళ్లు ఉన్నారు. అయితే, ఈ మూవీపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది మాత్రం హీరోయిన్లే. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఒకరు కేతిక శర్మ కాగా, మరొకరు ప్రియా వారియర్. ఇప్పుడు బ్రో మూవీ హిట్ అవ్వడం పవన్, తేజ్‌కి అంతగా అవసరం కాకపోయినా.. కానీ, వీరికి మాత్రం చాలా అవసరం. ఎందుకంటే, ఈ ఇద్దరు బ్యూటీలకు ఇప్పటి వరకు మంచి హిట్ పడిరది లేదు. కేతిక కి తెలుగులో ఇది నాలుగో చిత్రం. ముందు చేసిన మూడు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి. రొమాంటిక్, లక్ష్య, రంగ రంగ వైభ వంగా, ఈ మూడు చిత్రాల్లో కేతిక అందంగా కనిపించినా, మంచి నటన కనపరిచినా, ఆమెను అదృష్టం వరించలేదు. ఫలితంగా, ఆమె ఆశలన్నీ బ్రో మూవీ మీదే పెట్టుకుంది. అందుకే, మళ్లీ ఆమె తెలుగులో క్లిక్ అవ్వాలి అంటే, ఈ బ్రో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కావాల్సిందే. ఇక, ఈ మూవీ క్లిక్ కావాలంటే పవన్ మ్యాజిక్ చేయా ల్సిందే.