. రైటర్స్ అకాడమీ చైర్మన్ వీవీ రమణమూర్తి నివాళి
. సంజీవయ్య నగర్లో ఘనంగా వర్ధంతి
ఎన్ఏడీ, న్యూస్ లీడర్, జూలై 27: మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయమని, ఆయన సేవలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని రైటర్స్ అకాడమీ చైర్మన్ వీవీ రమణమూర్తి పిలుపునిచ్చారు. విశాఖ సంజీవయ్య నగర్ అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షేక్ ఖాసిం ఆధ్వర్యంలో గురువారం భారత 11వ రాష్ట్రపతి, క్షిపణి శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం స్థానిక జీవీఎంసీ 52వ వార్డు సంజీవయ్య నగర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వీవీ రమణమూర్తి తొలుత కలాం విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ గత ముప్పై ఏళ్లుగా సంజీవయ్య నగర ప్రాంతవాసి అబ్దుల్ ఖాసీం నేతృత్వంలో అబ్దుల్ కలాం విగ్రహాన్ని స్థాపించి జయంతి వర్ధంతి కార్యక్రమాలు చేయడం హర్షణీయమని కొనియాడారు. సంజీవయ్య నగర్ అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ షేక్ ఖాసిం మాట్లాడుతూ కలాం భారత రాష్ట్రపతి పదవికి ముందు, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో-)లో ఏరోస్పేస్ ఇంజనీర్‌గా పనిచేశారని గుర్తు చేశారు. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ మర్రిపాలెం బ్రహ్మ కుమారీస్ ఇన్చార్జి బీకే విమలాదేవి, బీకే పూర్ణచంద్రరావు, పర్వతనేని హరికిషన్, వీకే వైన్ మూర్తి, షేక్ ఇబ్రహీం, షేక్ అబ్దుల్ కలీఫా, ముత్యాల రవికుమాం,్ ముత్యాల శ్రీలత, లక్ష్మి, బాల స్థానికులు పాల్గొన్నారు.