ఆస్పత్రి మేనేజింగ్ ట్రస్టీ ఆచార్య వి.ఉమామహేశ్వరరావు పాండురంగాపురం లయన్స్ క్లబ్ రూ.1లక్ష విరాళం
విశాఖపట్నం, న్యూస్ లీడర్, జూలై 27: కేన్సర్ సంబంధిత రోగులకు శుభవార్త. విశాఖలోని లయన్స్ కేన్సర్ ఆస్పత్రిలో అధునాతన, సర్వయికల్ వ్యాక్సిన్ సేవలు మరింత విస్తృతం కానున్నాయి. ఈ మేరకు ఆస్పత్రి ట్రస్టీ ఆచార్య వెలగపూడి ఉమా మహేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. నగరంలోని పాండురంగాపురం లయన్స్ క్లబ్ తరఫున సభ్యులు గురువారం ఈ ఆస్పత్రికి రూ.1లక్ష విరాళంగా అందజేశారని, ఈ విరాళాన్ని ఐపీడీజీ లయన్ ఎం. ఉషారాజు, క్లబ్ అధ్యక్షులు లయన్ కె.పద్మావతి, కార్యదర్శి లయన్ కె. మంగతాయారు, కోశాధికారి దాట్ల శ్రీదేవి ద్వారా అందుకున్నామన్నారు. ఈ విరాళంతో రూ.2వేల విలువ చేసే 50డోసుల గర్భాశయ ముఖద్వార కేన్సర్ (సర్వయికల్) వ్యాక్సిన్ ను ఉచితంగా అందుబాట్లో ఉంచేందుకు అవకాశం వచ్చినందన్నారు. తమ ఆస్పత్రిలో పేదలకు విలువైన, అధునాతన సదుపాయాలతో పాటు, ఆరోగ్య శ్రీ సేవలు కూడా అందుబాట్లో ఉన్నాయని ఈ సందర్బంగా ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కళ్యాణ్ ప్రసాదు, శ్రీరామ్మూర్తి, జానకీ దేవి తదితరులు పాల్గొన్నారు.