విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూలై 27: వర్షాల నేపథ్యంలో మ్యాన్‌హోళ్ల విషయమై జీవీఎంసీ మరింత అప్రమత్తం కావాల్సి ఉంది. నగరంలో చాలా చోట్ల వాటికి మూతలు లేవు. వాటి నిర్వాహణ దారుణంగా ఉంటోంది. వానొచ్చే సమయంలో మ్యాన్‌హోళ్ల వద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వాటి నుంచి బయటకు వస్తున్న వ్యర్థాలు అనారోగ్యానికి కారకాలు కావచ్చు. సీబీఎం కాంపౌండ్‌లోని టింపనీ స్కూల్ ఏ గేట్ పరిసర ప్రాంతాల్లో యూజీడీ అస్తవ్యస్థంగా ఉంది. అక్కడి మ్యాన్‌హోళ్లకు చిల్లు పడి నాలుగు రోజుల నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. వర్షాల సమయంలో ఇక్కడి పరిస్థితి నిత్యకృత్యంగా మారిందని, జీవీఎంసీ శాశ్వత పరిష్కారం చూపించాలని ఏపీ ప్రైవేట్ పాఠశాలల తల్లిదండ్రుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సమయం హేమంత్‌కుమార్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.