అమలాపురం, న్యూస్‌లీడర్, జూలై 27: భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి జిల్లాల పరిధిలో అనేక గ్రామాలు నీట మునిగాయి. దీంతో దీంతో ఏపీ రెడ్ క్రాస్ అధ్యక్షులు, గవర్నర్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర రెడ్ క్రాస్ విభాగానికి పలు సూచనలు జారీ చేశారు. దీంతో కొనసీమ ప్రాంతంలో ఏపీ సంఘం చైర్మన్ డాక్టర్ ఎ. శ్రీధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, సీఈవో ఏకే ఫరీడా తక్షణమే అప్రమత్తమయ్యారు. బాధితులకు ఆహారం, శిబిరాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని నిర్ణయించారు. కోనసీమ ప్రాంతంలో చాలా మంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా పి.గన్నవరం మండలంలో జనం నరకం చూస్తున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సూచనలతో రెడ్ క్రాస్ సిబ్బంది హైజీన్ కిట్స్, తార్పాలిన్లు పంపిణీ చేశారు. రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంకులు, ప్రాజెక్టుల ఏపీ కో`ఆర్డినేటర్ బీవీఎస్ కుమార్ కోనసీమ జిల్లా అధికారులతో మాట్లాడి తొలి వాహనాన్ని విజయవాడ నుంచి మంగళవారం తొలి వాహనాన్ని పంపించారు.