అమరావతి, న్యూస్‌లీడర్, జూలై 3: 146 కొత్త 108 అంబులెన్స్‌లను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. 146 నూతన అంబులెన్స్‌లకు గానూ రాష్ట్ర ప్రభుత్వం రూ.34.79 కోట్లను ఖర్చు చేసింది. నూతన అంబులెన్స్‌ల ప్రారంభోత్సవంలో భాగంగా మొదట ఆరోగ్యశ్రీ సృష్టికర్త, దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి వైయస్ జగన్ నివాళులర్పించారు. అనంతరం నూతన అంబులెన్స్‌లను జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు నూతన అంబులెన్స్‌లను పరిశీలించి వాటిలో కల్పించిన అత్యాధునిక వైద్య సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేసింది. 2020లోనే మండలానికో 108ను అందుబాటులో ఉంచింది. రాష్ట్రంలో ప్రస్తుతం 768 అంబులెన్స్‌లు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. మరమ్మతులకు గురవుతున్న వాటి స్థానంలో కొత్త అంబులెన్స్‌లు సేవలు అందించనున్నాయి. నూతన 108 అంబులెన్స్‌ల ప్రారంభోత్సవంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషాశ్రీచరణ్, రహదారులు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు(రాజా), ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు.