` గజమాలలు, పూలమాలలతో స్వాగతించిన బీజేపీ శ్రేణులు, అభిమానులు
ఎన్ఏడీ, న్యూస్‌లీడర్, జూలై 28 : బీజేపీ ఏపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా విశాఖపట్నంకు విచ్చేసిన దగ్గుబాటి పురంధేశ్వరి ఘన స్వాగతం లభించింది. శుక్రవారం ఉదయం ఢల్లీి నుంచి చేరుకున్న ఆమెకు విశాఖ విమానాశ్రయంలో ఏపీ బీజేపీ ప్రోటోకాల్ కన్వీనర్ బాలరాజేశ్వరరావు, విశాఖ నగర అధ్యక్షుడు మేడిపాటి రవీంద్ర, కాశిరాజు, విష్ణుకుమార్‌రాజు తదితర బీజేపీ ముఖ్య నాయకులు విచ్చేసి స్వాగతం పలికారు.
ఎన్ఏడీ జంక్షన్ ఫ్లైఓవర్‌కు సమీపంలో బీజేపీ పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ దాడి పురుషోత్తమ రమేష్ ఆధ్వర్యంలో భారీ స్వాగత ఏర్పాట్లు నిర్వహించారు. నృత్యకళాకారులతో సాదరంగా స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు, అభిమానులు అడుగడుగునా పూలమాలలు, భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఎన్ఏడీ జంక్షన్ వద్ద బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీ గజమాలతో సత్కరించి పూలకిరీటం పెట్టి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన భారీ ఊరేగింపుగా బయలుదేరి లాసెన్స్ బే కాలనీలో గల పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు జీపీ నాయుడు, జిల్లా కార్యదర్శి సీహెచ్ మంజుల, స్కిల్ డెవలప్మెంట్ కన్వీనర్ నాదెండ్ల జ్యోతి, మండల ఉపాధ్యక్షులు ఎన్.కృష్ణారావు, వెంకటేశ్వరరావు, అధిక సంఖ్యలో మహిళలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు