టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా ఎనలేని క్రేజ్ తెచ్చుకున్నాడు పూరి జగన్నాథ్. మాస్, డ్యాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ గా యూత్ ను ఎంతగానో ఆకట్టుకున్నాడు. హీరోను ఎలివేట్ చేసే ఆయన టేకింగ్ కు యావత్ తెలుగు ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. హీరోయిజంతోపాటు కథానాయకుడిలో కొద్దిపాటి నెగెటివ్ షేడ్స్ చూపించి సరికొత్త పంథాను చూపించాడు. ఇదిలా ఉంటే ఇటీవల లైగర్ మూవీతో భారీ డిజాస్టర్ అందుకున్న ఆయన మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు చేస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమాలో రామ్ పోతినేనితోపాటు ఓ స్టార్ హీరో నటించనున్నాడని తెగ చర్చ జరుగుతోంది. పోస్టర్ ద్వారా పూరి జగన్నాథ్-రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎలాంటి హిట్ అందుకుందో తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతోపాటు రామ్ కెరీయర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్ హిట్ గా నిలిచింది. ఇక దీనికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమా రానన్నట్లు ఇటీవల పోస్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక జూలై 10 సోమవారం రోజున ప్రత్యేక అతిథుల సమక్షంలో డబుల్ ఇస్మార్ట్ సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించి గ్రాండ్ గా లాంచ్ చేశారు. జూలై 12 నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. పూజా కార్యక్రమం గురించి ప్రకటించినప్పుడే విడుదల తేదిని కూడా అనౌన్స్ చేసింది పూరి కనెక్ట్స్. మాస్ ఎంటర్టైనర్ గా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాను 2024 మార్చి 8న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు సోషల్ మీడియాలో పూరి కనెక్ట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో బాలీవుడ్ క్యూట్ హీరోయిన్ సాహో ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ నటించనున్నట్లు సమాచారం.