హైదరాబాద్, న్యూస్లీడర్, జూలై 28 : తెలుగుదేశం పార్టీ యువనేత లోకేశ్ చేపట్టిన ‘యువగళం’పై వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ఈ కార్యక్రమానికి జనం నుంచి స్పందన లేక చినబాబు చిన్నబోతున్నారంటూ ఎద్దేవా చేశారు. వేదికపై లోకేశ్ ఉన్న ఫోటోను జత చేసి ట్విట్టర్లో సందేశం పోస్టు చేశారు. అందులో.. ‘యువగళంకి స్పందన కరువు, ఎవరూ గాలానికి చిక్కడం లేదనా.. యాంకర్ గళాన్ని జోడిరచాడు లోకేశ్! ఎన్ని పగటి కలలు కన్నా, డ్రామాలు వేసినా ప్రయోజనం లేదు బాబూ..’ అంటూ ట్వీట్ చేశారు.