` జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ, జాతీయ కార్యదర్శిగా సత్యకుమార్ కొనసాగింపు ` ఉత్తర్వులు జారీ చేసిన పార్టీ అధ్యక్షుడు నడ్డా
ఢిల్లీ, న్యూస్‌లీడర్, జూలై 29 : బీజేపీ తెలంగాణ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను కట్టబెట్టారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణను కొనసాగిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అలాగే తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, ఆంధ్రప్రదేశ్ నుంచి సత్యకుమార్‌కు జాతీయ కార్యదర్శిగా మరోసారి అవకాశం కల్పించారు. పార్టీ వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా బీఎల్ సంతోష్, సంస్థాగత వ్యవహారాల ఉప ప్రధాన కార్యదర్శిగా శివప్రకాశ్‌ను కొనసాగించనున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించిన అనంతరం ఆయన అనుచరులు, అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. పార్టీ కీలక నేతలు కొందరు ఈ విషయంపై తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. తాజాగా సంజయ్‌కు జాతీయ స్థాయిలో బాధ్యతలను అప్పగించడంపై వీరంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి బండి సంజయ్ అందిస్తున్న సేవలకు మంచి గుర్తింపు లభించిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.