హైదరాబాద్, న్యూస్ లీడర్, జూలై 29: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలవడంతో అధికార పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలు చేరికలపై ఫోకస్ పెట్టాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ నేతలు, సీనియర్లను పార్టీ చేర్చే క్రమంలో కసరత్తు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి డీసీసీబీ మాజీ చైర్మన్లు జైపాల్ రెడ్డి, లక్ష్మారెడ్డి బీజేపీలో చేరుతున్నారు. మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి, సంజీవ రావు కాషాయతీర్థం పుచ్చుకోనున్నారు. వీరంతా ఇప్పటికే వివేక్‌ను కలిశారు. ఇదిలా ఉండగా.. తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డితో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ భేటీ అయ్యారు. ఈ క్రమంలో జయసుధ బీజేపీలో చేరేందుకు ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. మరోవైపు.. హైకమాండ్ పిలుపు నేపథ్యంలో కిషన్‌రెడ్డి, డీకే అరుణ ఇప్పటికే ఢల్లీికి బయలుదేరారు. ఈటల రాజేందర్ సైతం ఢల్లీిలోకి వెళ్లారు. వీరు తిరిగి తెలంగాణకు వచ్చిన తర్వాత పార్టీలో చేరికలపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.