ఇండియాలోని చాలా ఇండస్ట్రీల కంటే బాలీవుడ్లోనే స్టార్ల వారసులు ఎంట్రీ ఎక్కువగా కనిపిస్తుంది. ఇలా వచ్చిన వారిలో అతి తక్కువ మంది మాత్రమే మంచి పేరును, ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో చుంకీ పాండే వారసురాలు అనన్య పాండే ఒకరు. చిన్న ఏజ్ లోనే హీరోయిన్గా వచ్చిన ఈ బ్యూటీ.. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ను అందుకుని స్టార్‌గా ఎదిగింది. దీంతో వరుస గా సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అనన్య తన బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి మరి! అలా వచ్చి ఫుల్ ఫేమస్: లెజెండరీ యాక్టర్ చుంకీ పాండే కూతురిగా అనన్య పాండే ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ అనే సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. పునిత్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో ఆమెకు గ్రాండ్ ఎంట్రీ దక్కడంతో పాటు ఆఫర్లు వచ్చాయి. దీంతో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ దేశ వ్యాప్తంగా ఫుల్ ఫేమస్ అయిపోయింది. తక్కువ చిత్రాలకే క్రేజ్: హీరోయిన్గా గ్రాండ్ ఎంట్రీని దక్కించుకున్న అనన్య పాండేకు ఎన్నో సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. కానీ, ఈ అమ్మడు ‘పతీ పత్నీ ఔర్ వో’, ‘అంగ్రేజీ మీడియం’, ‘ఖాలీ పీలీ’, ‘గెహరియాన్’ వంటి చిత్రాల్లోనే నటించింది.