` కొత్తపుంతలు తొక్కుతున్న ఏయూ
` కొత్త ప్రాజెక్టులు, స్టార్ట్‌ప్‌లతో దూసుకుపోతున్న వర్సిటీ
` 1న ఐదు ప్రోగ్రామ్స్‌కు ప్రారంభించనున్న సీఎం జగన్
` వీసీ ప్రసాదరెడ్డి హయాంలో సరికొత్త ఆధునిక కోర్సులు
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూలై 31 : మహోన్నత ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధునిక బాట పడుతోంది. విద్యారంగంలో కాలానుగుణంగా వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకుంటూ ఆధునిక విద్యార్థికి అవసరమైన విద్యను అందించేందుకు ప్రాధాన్యమిస్తోంది. ప్రస్తుత వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి హయాంలో స్టార్టప్ అభివృద్ధి కేంద్రాలు, పేరొందిన సంస్థలతో ఒప్పందాలు చేసుకోవడం, కేంద్ర`రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ కొత్త అధ్యయన అవకాశాలు కల్పించడం వంటి విద్యా కార్యక్రమాలు విరివిగా జరుగుతున్నాయి. అకడమిక్ కోర్సులకు అవసరమైన రీతిలో అభివృద్ధి చేస్తూనే.. ఆధునిక టెక్నాలజీ కోర్సులు, అవకాశాలకు స్థానం కల్పిస్తున్నారు. ఫలితంగా దేశంలోనే ప్రఖ్యాత విద్యాసంస్థల సరసన ఏయూ నిలబడ గలుగుతోంది. విదేశీ విద్యార్థులను ఆకర్షించడంలోనూ ఏయూ ముందంజలో ఉంది. ఆయా దేశాల విద్యార్థులకు అవసరమైన కోర్సులు ఇక్కడ తక్కువ ఖర్చుతో లభిస్తుండడమే ఇందుకు కారణం. ఈ క్రెడిట్ అంతా వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి కృషి ఫలితమేనని పలువురు ప్రశంసిస్తున్నారు.
ఈ క్రమంలో సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఐదు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మంగళవారం ఆంధ్ర విశ్వవిద్యాలయానికి విచ్చేయనున్నారు. గత కొన్నేళ్ల నుంచి అధ్యయనం, కోర్సుల పరంగా ప్రగతిపథంలో పయనిస్తున్న ఏయూ చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయం. వీసీ ప్రత్యేక చొరవ తీసుకొని ఈ స్టార్టప్‌లను ఏర్పాటు జరిగేలా చూడడమే కాకుండా ముఖ్యమంత్రితో వాటిని ప్రారంభించేందుకు కృషి చేయడంపై సర్వత్రా ప్రశంసిస్తున్నారు.
మూడేళ్లలో 18 నూతన ప్రాజెక్టుల అభివృద్ధి..
గత మూడేళ్లుగా ఆంధ్రవిశ్వవిద్యాలయంలో దాదాపు 18 నూతన అభివృద్ది ప్రాజెక్టులను అభివృద్ధి చేశారు. వీటిని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి ఐదు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా టెక్ స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్` ఆ హబ్, ఫార్మా ఇంక్యుబేషన్ ` ఎలిమెంట్, ఏయూ డిజిటల్ జోన్ అండ్ స్మార్ట్ క్లాస్‌రూం కాంప్లెక్స్` అల్గారిథమ్, ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ (ఏయూ సిబ్), ఏయూ అవంతి ఆక్వా కల్చర్ ఇన్నోవేషన్ స్కిల్ హబ్‌లను ప్రారంభించనున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన వీసీ..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన నేపథ్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రి సందర్శించే ఎలిమెంట్ భవనాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అనంతరం బీచ్‌రోడ్డులో ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జరిగే సమావేశం ఏర్పాట్లను ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద రెడ్డి స్వయంగా పరిశీలించారు. అవసరమైన సూచనలు చేశారు.
సీఎం చేయనున్న ప్రారంభోత్సవాలు..
1. ఏ హబ్ (ఆంధ్రా యూనివర్శిటీ స్టార్టప్ Ê టెక్నాలజీ ఇంక్యుబేషన్ హబ్)..
ఏ హబ్‌ను 30,000 చదరపు అడుగులు విస్తీర్ణంలో రూ.21 కోట్లతో నిర్మించారు. సెక్షన్ 8 కంపెనీ, బహుళ రంగ-ఆధారిత ఇంక్యుబేషన్ సెంటర్లు, అనుబంధ కేంద్రాలు, ప్రోటోటైపింగ్/ మేకర్స్ ల్యాబ్స్, స్టూడెంట్ ఐడియేషన్ సెంటర్లు ద్వారా 2025 నాటికి 2.0 లక్షల చదరపు అడుగులతో భారతదేశం అతిపెద్ద సమీకృత బహుళ-క్రమశిక్షణ ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌లో ఒకటిగా ఉండాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశారు.
ఆంధ్రా యూనివర్శిటీ ఇంక్యుబేషన్ హబ్ (ఏ హబ్) 2022, ఏప్రిల్‌లో కార్యకలాపాలను ప్రారంభించింది. 2002`23లో 121 స్టార్టప్‌లను వృద్ధి చేసింది. ఇందులో 114 వివిధ రంగాల ద్వారా ఆదాయం అందించనవి కావడం విశేషం. ఈ సమయంలో ఈ హబ్ దేశంలోనే అత్యధిక రేటింగ్ పొందిన యూనివర్సిటీ-ఆధారిత స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ, 2023లో 4-స్టార్ రేటింగ్‌తో, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ (ఐఐసీ) రేటింగ్ పొందింది. ఇటీవల ఎన్ఐఆర్ఎఫ్ ఇన్నోవేషన్ ర్యాంకింగ్ 2023, ఆంధ్రా యూనివర్సిటీ ఇంక్యుబేషన్ హబ్ దేశంలోని 2478 మంది పాల్గొనే వారిలో బ్యాండ్ 11-50లో ర్యాంక్ పొందింది. ఇది భారతదేశంలోని టాప్ 1 శాతంలో ఒకటిగా ఉంది. ఇది బ్యాండ్ 11-50కి మార్చబడిన ఏకైక రాష్ట్ర విశ్వవిద్యాలయం నిర్వహించబడే కేంద్రంగా ఉంది. విద్యా మంత్రిత్వ శాఖ ఐఐసీ ర్యాంకింగ్‌లో 4-స్టార్ రేటింగ్‌ను సాధించింది.
2. ఎలిమెంట్ (ఆంధ్రా యూనివర్సిటీ ఫార్మా ఇంక్యుబేషన్ Ê బయోలాజికల్ మానిటరింగ్ హబ్)..
ఇది ఫార్మా/ బయో టెక్/ జెనోమిక్స్ ఇంక్యుబేషన్, టెస్టింగ్ ల్యాబ్ కోసం బిల్డ్ స్పేస్, ఇన్నోవేషన్, డ్రగ్ రీసెర్చ్, ఫార్మసీ, బయోటెక్ వర్టికల్స్‌లో స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేశారు. దీన్ని రూ.44 కోట్లతో నిర్మించారు. ఎలిమెంట్ అనేది 3 ప్రధాన ఫార్మా కంపెనీలతో ఎంవోయూ చేసుకొని రూపొందించింది. కొత్త రసాయనాలను అభివృద్ధి చేయడం, మందులు, ఆహారాల విశ్లేషణ, ఔషధాల కోసం కొత్త విశ్లేషణాత్మక పద్ధతుల అభివృద్ధి, అశుద్ధ ప్రొఫైలింగ్, ఔషధాల సంశ్లేషణ ప్రత్యామ్నాయ పద్ధతులు మొదలైన ఔషధ పరిశ్రమల అవసరాలను మూలకం తీరుస్తుంది.
3. అల్గోరిథం (ఆంధ్రా యూనివర్సిటీ డిజిటల్ జోన్ అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ కాంప్లెక్స్)..
ఇది రూ.35 కోట్లతో ఏర్పాటు చేశారు. 250 సీటింగ్ సామర్థ్యం గల 2 ఆధునిక సెమినార్ హాళ్లు, 15 స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, ఒక ప్రత్యేకమైన ఫ్లోర్‌తో పాటు 500 కంప్యూటర్ సిస్టమ్స్‌తో శిక్షణ, ఆన్లైన్ టెస్టింగ్ ప్రయోజనాల కోసం ఉపయోగ పడుతుంది.
డిజిటల్ జోన్ పరిశ్రమ, పరిశోధన, ఎప్పటికప్పుడు పెరుగుతున్న కంప్యూటర్ ఇంజనీరింగ్ ప్రతిభ అవసరాలను తీర్చేలా రూపుదిద్దారు. ఏఆర్/ వీఆర్, ఆటోమేషన్, రోబోటిక్స్, డ్రోన్ అసెంబ్లీ, ఐవోటీ అండ్ ఈవీ సిస్టమ్‌లలో స్మార్ట్ క్లాస్ రూమ్‌లు, ల్యాబ్‌లను కలిగి ఉంటుంది.
4. ఏయూ`ఎస్ఐబీ (ఆంధ్రా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్)..
ఇది ఐఐఎం, విశాఖపట్నంతో ఒప్పందం మేరకు ఏర్పాటు చేసిన సంస్థ. ఇందుకోసం రూ.18 కోట్లు వెచ్చింది. 25 చ.ద.అ. విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ వ్యాపారం, అనలిటిక్స్‌లో ప్రత్యేక బ్యాచిలర్/ మాస్టర్ ప్రోగ్రామ్‌లను అందించడానికి ఇది ఏర్పాటైన సంస్థ. 50 శాతం మంది అంతర్జాతీయ విద్యార్థులను తీసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు మారుతున్న ప్రపంచ అవసరాలను తీర్చడానికి బహుళ-ప్రాంతీయ, బహుళ-సాంస్కృతిక అనుభవపూర్వక అభ్యాసాన్ని అందిస్తుంది. ఈ సంస్థ ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్స్ తరహాలో ఒక ప్రధానమైన సంస్థగా ఉపయోగ పడుతుంది.
5. ఏయూ ` అవంతి (ఆంధ్రా యూనివర్సిటీ అవంతి ఆక్వాకల్చర్ స్కిల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్..
ఇది మెరైన్ ఫార్మింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ అవసరాలను తీర్చేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. ఏయూ`అవంతి ఆక్వా కల్చర్ జాయింట్ వెంచర్. రూ.11 కోట్లతో 12 వేల చ.అ. స్థలంలో ఏర్పాటు చేశారు. వైజాగ్‌లో ఆక్వాకల్చర్ స్కిల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ఆక్వాకల్చర్, రొయ్యల పెంపకంలో వనరులను ఉత్పత్తి చేయడం కోసం మొదటిసారిగా ఏర్పాటు చేశాయి.
1న సీఎం జగన్ విశాఖ రాక
` పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పారంభోత్సవాలు
` ఏయూలో పలు కార్యక్రమాలు, విద్యార్థులతో ముఖాముఖి
` వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి నేతృత్వంలో ఏర్పాట్లు
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, జూలె 31 : వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి మంగళవారం విశాఖపట్నం విచ్చేస్తున్నారు. ఆయన ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. ముందుగా కైలాసపురం పోర్టు ఆసుపత్రి సమీపంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తారు. అనంతరం హై-టీలో పాల్గొంటారు. అదే ప్రాంగణంలో జీవీఎంసీకి చెందిన 50 అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సిరిపురంలోని ఏయూ క్యాంపస్‌కు చేరుకుంటారు. ఎలిమెంట్ ఫార్మా ఇంక్యుబేషన్ సెంటర్, బయో మానిటరింగ్ హబ్‌తో సహా ఐదు ప్రాజెక్టులకు సంబంధించిన భవనాలను సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత అక్కడి నుంచి విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకొని తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.