. చర్చకు అవకాశం ఇస్తున్నా అల్లరెందుకు?
. విపక్షాలపై బీజేపీ నేత పీయూష్ గోయల్ ఆగ్రహం
ఢిల్లీ, న్యూస్‌లీడర్, జూలై 31: గత కొద్దిరోజులుగా పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో గందరగోళ వాతావరణం నెలకొంది. విపక్ష ఎంపీల నిరసనలతో సోమవారం కూడా వాయిదాల పర్వం కొనసాగింది. మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడిరది. అలాగే రాజ్యసబ కార్యకలాపాలు మధ్యాహ్నం 12 గంటలవరకూ నిలిచిపోయాయి. ఈ సమావేశాలకు ముందు పార్లమెంట్‌కు వచ్చిన ప్రధాని మోడీ కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. అలాగే ప్రతిపక్షాల కూటమి ఇండియా సభ్యులు కూడా భేటీ అయ్యారు. రెండు రోజులపాటు మణిపూర్‌లో పర్యటించిన నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మొదలైన సమావేశాలను మణిపూర్ అంశం కుదిపేసింది. దాంతో దిగువసభ మధ్యాహ్నం రెండువరకు వాయిదా పడిరది.
రాజ్యసభ సభాపక్ష నేత పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ‘మధ్యాహ్నం రెండు గంటలకు రాజ్యసభలో మణిపూర్ అంశాన్ని చర్చించాలని మేం కోరుకుంటున్నాం. సభ్యులకు ఇచ్చిన స్వేచ్ఛను విపక్ష ఎంపీలు దుర్వినియోగం చేసేలా ప్రవర్తిస్తున్నారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. వారు ఈ సెషన్లో తొమ్మిది రోజులను వృథా చేశారు’ అని గోయల్ వెల్లడిరచారు. ఈ క్రమంలో విపక్షాల నిరసనల మధ్య రాజ్యసభ వాయిదా పడిరది. మణిపూర్ అంశాన్ని రూల్ 267 కింద చర్చించాలని కోరడమే అందుకు దారితీసింది.