ఢిల్లీ, న్యూస్‌లీడర్, ఆగస్టు 1 : విపక్ష ఎంపీలు ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు తేదీలు ఖరారయ్యాయి. లోక్‌సభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టు 8, 9, 10 తేదీల్లో చర్చ జరగనుంది. సభలో ఆగస్టు 10న ప్రధాని మోడీ మాట్లాడనున్నారు. ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో జాతుల మధ్య వైరం జరుగుతోంది. దానిపై ప్రకటన చేసేందుకు మోడీ పార్లమెంట్‌కు రావాలని వర్షాకాల సమావేశాలు మొదలైన రోజు నుంచి విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే విపక్షాలు అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టాయి.