‘జైలర్’ సినిమా డైరక్టర్ నెల్సన్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు సూపర్‌స్టార్ రజనీకాంత్. ‘బీస్ట్’ సినిమా విడుదల కాకమునుపే నెల్సన్ తనకు ‘జైలర్’ కథ చెప్పారన్నారు. ‘బీస్ట్’ ఫ్లాప్ కావడంతో నెల్సన్‌తో సినిమా చేయొద్దని చాలా మంది సలహా ఇచ్చారని అన్నారు. అయితే, అవేమీ పట్టించుకోవద్దని సన్‌పిక్చర్స్ వాళ్లు అన్నారని, ‘జైలర్’ ప్రాజెక్ట్‌ని ముందుకు తీసుకెళ్లారని తెలిపారు.