ఆణిముత్యం లాంటి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం
విశాఖలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మాల్ నిర్మాణం
8 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు
ఇనార్బిట్ మాల్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం జగన్
ఫేస్-2 కింద 2.5 లక్షల చదరపు అడుగుల్లో ఐటీ స్పేస్
మరో 3వేల మందికి ఉపాధి
ఇనార్బిట్ మాల్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం జగన్
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 1: దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మాల్ నిర్మాణానికి విశాఖ వేదిక అయ్యింది. విశాఖ నగరం రూపురేఖలు మార్చే గొప్ప ప్రాజెక్టుగా ఇది నిలిచిపోతుంది’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విశాఖ నగరంలోని కైలాసపురం వద్ద రూ.600 కోట్లతో రహేజా గ్రూప్ నిర్మిస్తున్న దక్షిణ భారత అతిపెద్ది ఇనార్బిట్ మాల్ నిర్మాణానికి సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఈ మాల్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 8 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం వైయస్ జగన్ మాట్లాడారు. విశాఖ అభివృద్ధికి మరింత దోహదపడుతూ, మరింత మంచి జరిగిస్తూ ఆణిముత్యంలా నిలిచిపోయే ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామన్నారు.
సీఎం జగన్ ప్రసంగంలో..
దాదాపు 17 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 13 ఎకరాల్లో ఇనార్బిట్ మాల్ నిర్మాణం జరుగుతుందన్నారు. ఇదే ఇనార్బిట్ మాల్ రహేజా గ్రూప్ హైదరాబాద్‌లో 7-8 ఎకరాల్లో కడితే విశాఖలో ఏకంగా 13 ఎకరాల్లో నిర్మిస్తోందన్నారు. ఈ కార్యక్రమాన్ని సాధ్యం చేసిన నీల్ రహేజా, సీఈవో రజినీశ్ మహజన్, సీవోవో శ్రవణ్‌కుమార్‌లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద మాల్ నిర్మాణం మన విశాఖలో జరుగుతుందన్నారు. రూ.600 కోట్లతో ఇనార్బిట్ మాల్ నిర్మిస్తున్నారు, అంతేకాకుండా ఈ మాల్ ద్వారా మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. 13 ఎకరాల్లో మాల్ నిర్మాణం జరిగిన తరువాత మిగిలిన 4 ఎకరాల్లో రాబోయే రోజుల్లో ఫేస్-2 కింద ఐటీ స్పేస్ క్రియేట్ చేయనున్నారు. ఇంటర్నేషనల్ స్టాండెడ్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు. వీటన్నింటి ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగు అవుతాయి, 2.5 లక్షల ఎస్ఎఫ్టీలో ఐటీ స్పేస్ రావడంతో కనీసం మరో 3 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయ్ణి, ఇవన్నీ రాబోయే రోజుల్లో విశాఖను గ్లోబల్ చాట్‌లో పెట్టడంలో ఉపయోగపడే కార్యక్రమాలంటూ సీఎం పేర్కొన్నారు. ఇటీవల విశాఖలో అదానీ డేటా పార్కు, ఐటీ స్పేస్‌కు శంకుస్థాపనలు చేశాం, భోగాపురం ఎయిర్‌పోర్టుకు అదే రోజు భూమిపూజ చేశాం, ఉత్తరాంధ్ర ప్రాంత రూపురేఖలు మార్చే విధంగా మూలపేటలో పోర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాం, ఇవన్నీ రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చబోయే గొప్ప అడుగులు అన్నారు. ఆ కోవలోనే దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద మాల్ నిర్మాణం విశాఖలో జరుగుతుందన్నారు.
ఇవే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 5స్టార్ హోటల్స్ నిర్మించిన సంస్థలు మన విశాఖలో పెట్టుబడులు పెట్టాయి, మన రాష్ట్రంలో రాజ్ విల్లాస్ మాదిరిగా ఇటీవల ఒబేరాయ్ సంస్థ సూపర్ లెగ్జరీ రిసార్ట్స్ నిర్మాణానికి భూమిపూజ చేశామన్నారు. మైఫేర్ సంస్థ 7స్టార్ లెగ్జరీ రిసార్ట్ నిర్మించబోతుంది, అదే కోవలో మాకు కూడా సపోర్టు చేస్తే మేమూ లెగ్జరీ రిసార్ట్స్ నిర్మిస్తామని నీల్ రహేజా ఆసక్తి చూపారు, రాబోయే రోజుల్లో రహేజా గ్రూప్ కూడా 7స్టార్ లెగ్జరీ రిసార్ట్స్ నిర్మించనున్నారన్నారు. రహేజా సంస్థకు అన్ని విధాలుగా సపోర్టు చేస్తాం, ఒక్క ఫోన్‌కాల్ దూరంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది వీటన్నింటి ద్వారా విశాఖపట్నం రూపురేఖలు మారనున్నాయన్నారు. హిందూపూర్‌లో కూడా 350 ఎకరాలకు సంబంధించిన ప్రాజెక్టులో ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్ పార్కు ద్వారా 15 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఆ ప్రాజెక్టుకు అన్ని రకాలుగా అడుగులు ముందుకువేశాం, ఆ ప్రాజెక్టుకు సపోర్టు చేస్తే యుద్ధప్రాతిపదికన టేకప్ చేస్తామని చెప్పారు. దానికి సంపూర్ణ సహకారాలు అందిస్తాం’ అని సీఎం వైయస్ జగన్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయడు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ నీల్ రహేజా, సీఈఓ రజనీష్ మహాజన్, సీఓఓ శ్రావణ్ కుమార్, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
RRRR
సీఎం జగన్‌కు ఘన స్వాగతం..
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. ఒక రోజు పర్యటనలో భాగంగా విశాఖకు విచ్చేసిన సీఎంకి మంత్రులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి Ê గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ విఫ్ కరణం ధర్మశ్రీ, పార్లమెంటు సభ్యులు ఎం వి.వి. సత్యనారాయణ, నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లేపల్లి సుభద్ర, జిల్లా కలెక్టర్ డా ఏ మల్లికార్జున, నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ , జాయింట్ కలెక్టర్ కె ఎస్ విశ్వనాథన్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, ముత్తం శెట్టి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, అదీప్ రాజ్, వి.ఎం.ఆర్.డి.ఏ చైర్ పర్సన్ అక్కరమని విజయనిర్మల, డిసిసిబి చైర్మన్ కోలాగురువులు, రెవెన్యూ డివిజినల్ అధికారి హుస్సేన్ సాహెబ్ తదితరులు ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రి తోపాటు జిల్లా ఇంచార్జ్ మరియు ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విచ్చేశారు.