టాలీవుడ్లోనే కాదు.. ఇండియన్ సినిమాలోనే చిరంజీవి అనేది పేరు కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్. సాక్షాత్తు అమితాబ్ బచ్చనే మన మెగాస్టార్‌ను కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అన్నారు. రజినీకాంత్, కమల్ కలిస్తే చిరంజీవి అంటూ బాలచందర్ లాంటి దిగ్గజ దర్శకుడే ప్రశంసించారు. అలాంటి చరిత్ర చిరు సొంతం. ఆయన పేరు వాడుకున్న హీరోలెంతో మంది ఉన్నారు. మెగా ఫ్యామిలీ అయితే మరీనూ..! చిరంజీవి ఇమేజ్ను పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ ఇలా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతీ హీరో వాడేసుకున్నారు. అంతేకానీ… చిరంజీవి పేరే ఓ బ్రాండ్.. ఆయన పేరు, పోస్టర్స్, టైటిల్స్ వాడుకుని తెలుగులో ఎన్నో సిని మాలు వచ్చాయి. అయితే అలాంటి మెగాస్టార్ ఇప్పుడు ఒక్క విషయంలో మాత్రం వెనక్కి తగ్గుతున్నారు.. అది చూసి మెగా ఫ్యాన్స్ సంతోషిస్తు న్నారేమో కానీ బయట కామన్ ఆడియన్స్ మాత్రం అసలు చిరు ఇలా ఎందుకు చేస్తున్నారబ్బా అనుకుంటున్నారు. ఆయన రేంజ్‌కు ఇది తగదం టూ వారిస్తున్నారు. ఇంతకీ ఏంటా విషయం..? టాలీవుడ్లోనే కాదు.. ఇండియన్ సినిమాలోనే చిరంజీవి అనేది పేరు కాదు.. ఇట్స్ ఏ బ్రాండ్. సాక్షాత్తు అమితాబ్ బచ్చనే మన మెగాస్టార్‌ను కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా అన్నారు. రజినీకాంత్, కమల్ కలిస్తే చిరంజీవి అంటూ బాలచందర్ లాంటి దిగ్గజ దర్శకుడే ప్రశంసించారు. అలాంటి చరిత్ర చిరు సొంతం. ఆయన పేరు వాడుకున్న హీరోలెంతో మంది ఉన్నారు. మెగా ఫ్యామిలీ అయితే మరీనూ..! చిరంజీవి ఇమేజ్ను పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్ ఇలా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రతీ హీరో వాడేసు కున్నారు. అంతేకానీ మెగాస్టార్ ఎప్పుడూ మిగిలిన హీరోలను వాడుకోలేదు. అలాంటి చిరు ఇప్పుడు భోళా శంకర్‌లో ఫస్ట్ టైమ్ తమ్ముడు పవన్ కళ్యాణ్‌తో పాటు తనయుడు రామ్ చరణ్‌ను వాడుకున్నారు. అంతేకాదు.. రాజశేఖర్‌ను కూడా ఇమిటేట్ చేసారు ఈ ట్రైలర్లో. చిరంజీవి అనేదే ఓ బ్రాండ్ అయినపుడు.. ఆయన మరో హీరోను ప్రమోషన్ కోసం వాడుకోవడంపైనే చర్చ జరుగుతుంది. అది తమ్ముడైనా కావచ్చు.. కొడుకైనా అవ్వొచ్చు.. చిరంజీవికి కూడా ఇంకో హీరో అవసరమా అనే ప్రశ్నలు మొదలయ్యాయిపుడు. మెగా ఫ్యాన్స్ దీన్ని ఎంజాయ్ చేస్తారేమో కానీ.. కామన్ ఆడియన్స్‌కు డైజెస్ట్ చేసుకోవడం కాస్త కష్టమే. మొత్తానికి ఈ ఇమిటేషన్స్ భోళాకు ఏ మేర హెల్ప్ అవుతాయో చూడాలి.