ఢిల్లీ, న్యూస్లీడర్, ఆగస్టు 1 : నారాయణ ‘ఇంటిగుట్టు’ వ్యవహారంపై వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందించారు. తనదైన స్టైల్లో ఇటు టీడీపీపైనా, అటు నారాయణను ఉద్దేశించి ట్వీటర్లో సెటైర్లు సంధించారు. ‘ఇంటిగుట్టు ఎప్పుడు బయటపడ్డా ఒక మెంటల్ సర్టిఫికెట్తో రెడీగా ఉంటుంది టీడీపీ. అసలు ఆ పార్టీకి మెంటల్ సర్టిఫికెట్ ఇచ్చే రోజు దగ్గర్లోనే ఉంది. మరదలు సంగతి సరే కన్నతల్లే చెప్పారుగా. ఆమెపైనా ముద్ర వేస్తారా నారాయణ! నారాయణ! నారాయణ!’ అంటూ ట్వీటారు.