విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 2: ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్`2 క్రికెటర్ల వేలం విశాఖలో జరిగింది. మొత్తం ఆరు ప్రాంఛైజీల జట్ల ప్రతినిధులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర లయన్స్ జట్టు కె.ఎస్.భారత్‌ను రూ.6లక్షలకు, బెజవాడ టైగర్స్ జట్టు రిక్కీభుయ్ను రూ.8లక్షలకు, రాయలసీమ కింగ్స్ జట్టు హనుమవిహారిని రూ.6.60 లక్షలకు, పి.గిరినాథరెడ్డిని రూ.6.10 లక్షలకు కొన్నాయి. ఒక్కో జట్టు 20 మంది క్రికెటర్ల చొప్పున 120 మందిని కొనుగోలు చేసి ప్రాంఛైజీలోకి తీసుకుంది. అంతకు ముందు వేలం పాటను ఏపీఎల్ యాక్టింగ్ చైర్మన్ మునీస్ సెహగల్ ప్రారంభించారు. పోటీలు ఈ నెల 16వ తేదీ నుంచి 27వ తేదీ వరకు విశాఖలోని ఏసీఏ`వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతాయి. కార్యక్రమంలో ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథ్ రెడ్డి, వాఖ్యత చారు శర్మ, తదితరులు పాల్గొన్నారు.