ఐదు కేంద్రాల ప్రత్యేకతలను ముఖ్యమంత్రికి
స్వయంగా వివరించిన ఏయూ వీసీ ప్రసాద్ రెడ్డి
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 1: ఆంధ్ర విశ్వ విద్యాలయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి విచ్చేసి వర్సిటీలో ఐదు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ముందుగా సిరిపురం వద్దనున్న ఫార్మ ఇంక్యుబేషన్, బయో మానిటరింగ్ హబ్-ఎలిమెంట్‌కి చేరుకున్నారు. ఎలిమెంట్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం అదే వేదిక నుంచి మరో నాలుగు భవనాల శిలాఫలకాల ఆవిష్కరించి ప్రారంభించారు. గత మూడు సంవత్సరాలుగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 18 ప్రాజెక్టులు చేపట్టగా, వీటిలో ఐదు ప్రాజెక్ట్‌లను మంగళవారం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆరంభించారు. అవి టెక్ స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్` ఆ హబ్, ఫార్మ ఇంక్యుబేషన్`ఎలిమెంట్, ఏయూ డిజిటల్ జోన్ అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్ కాంప్లెక్స్` అల్గారిథమ్, ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్(ఏయూ సిబ్), ఏయూ అవంతి ఆక్వా కల్చర్ ఇన్నోవేషన్ స్కిల్ హబ్‌లను ప్రారంభించారు. ఆంధ్ర విశ్వ విద్యాలయంలో యువతను ఆవిష్కర్తలగా తీర్చిదిద్దడానికి ఉపయుక్తంగా నిలిచే ఈ ఐదు కేంద్రాల ప్రత్యేకతలను, పనితీరు, ప్రగతిని ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రికి వివరించారు. ఎలిమెంట్ భవనంలో ఏర్పాటుచేసిన ఫార్మసీ లేబరేటరీని ముఖ్యమంత్రి పరిశీలించి అక్కడ ఉన్న ఉపకరణాలు పనితీరు తెలుసుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 130 కోట్ల రూపాయల వ్యయంతో విద్యార్థులకు ఉపయుక్తంగా అభివృద్ధి చేసిన భవనాలు ప్రాజెక్టులను ప్రారంభించడం పట్ల ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. ఏయు ప్రిన్సిపల్స్, ఇతర అధికారులను ముఖ్యమంత్రికి వీసీ ప్రసాద్ రెడ్డి స్వయంగా పరిచయం చేశారు. ఎలిమెంట్ భవనం బయట పెద్ద సంఖ్యలో విద్యార్థులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. వీరికి ముఖ్యమంత్రి చిరునవ్వుతో అభివాదం చేస్తూ పలకరించారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని, ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కే హేమచంద్ర రెడ్డి, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె.స్యామలరావు, ఏయూ రెక్టర్ ఆచార్య కె.సమత, రిజిస్త్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, అవంతి ఫీడ్స్ అధినేత ఇంద్ర కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున, జీవి ఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, జాయింట్ కలెక్టర్ కె.ఎస్. విశ్వనాధన్, ఏయూసెనేట్ సభ్యులు డాక్టర్ కుమార్ రాజా, ప్రిన్సిపాల్ ఆచార్య వై రాజేంద్రప్రసాద్, కె.శ్రీనివాసరావు, జి.సషి భూషణరావు, ఏ నరసింహారావు, టి. శోభ శ్రీ, ఎస్. కె భట్టి, అంబేద్కర్ చైర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. జేమ్స్ స్టీఫెన్, ఇంక్యుబేషన్ సెంటర్ సీఈవో రవి ఈశ్వరపు, ఆచార్య కృష్ణ మంజరి పవర్, టి.షారోన్ రాజు ఆచార్య ఎన్ఏడి పాల్, ఆచార్య కె. బసవయ్య తదితరులు పాల్గొన్నారు.