విశాఖపట్నం, న్యూస్లీడర్, ఆగస్టు 1: విశాఖలో పలు జీవీఎంసీ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శంఖుస్థాపనలు చేశారు. మంగళవారం ఉదయం విశాఖ చేరుకున్న ముఖ్యమంత్రి పోర్టు హాస్పిటల్ కైలాసపురం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని పలు ప్రాంతాలలో సుమారు రూ.134.58 కోట్లతో నిర్మించనున్న అభివృద్ధి పనులకు సీఎం శంఖుస్థాపనలు చేశారు. అమృత్ పథకంలో భాగంగా 32 పనులకు గాను రూ.107.42 కోట్లు, స్మార్ట్ సిటీ పథకంలో 07 పనులకు రూ.16.10 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నిధులతో 8 పనులకు 11.06 కోట్లు మొత్తం 47 పనులకు రూ.134.58 కోట్లు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు.