ఢిల్లీ, న్యూస్ లీడర్, ఆగస్టు 2: మణిపూర్ అల్లర్లు, ఢిల్లీ అధికారుల నియంత్రణ బిల్లును వ్యతిరేకిస్తూ లోక్సభలో విపక్ష సభ్యులు ఆందోళనలు చేశారు. విపక్ష ఎంపీల నినాదాల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలను గంటసేపు చేపట్టారు. అయితే ప్రతిపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళన చేపట్టాయి. మణిపూర్ అంశంపై చర్చకు పట్టుబట్టిన విపక్షాలు.. ప్రధాని మోడీ రాజ్యసభకు వచ్చి దీనిపై ప్రకటన చేయాల్సిందేనని డిమాండ్ చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. వారి నిరసనల మధ్యే సభా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.