హైదరాబాద్, న్యూస్లీడర్, ఆగస్టు 2: 2009లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన జయసుధ తెలంగాణలో బీజేపీలో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరబోతున్నారు. బుధవారం ఉదయం ఆమె ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకోనున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, బండి సంజయ్ ఢిల్లీలో ఉన్నారు.