. అక్కడికక్కడే మృతి . తండ్రి కళ్లెదుటే మృత్యువాత . హైదరాబాద్లో ఘోరం
హైదరాబాద్, న్యూస్ లీడర్, జూలై 31: హైదరాబాద్లో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇటీవల వర్షాలకు రోడ్డుపై ఏర్పడిన గుంతలు ఓ చిన్నారి ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. తండ్రితో కలిసి బైక్పై స్కూలుకు వెళుతున్న రెండో తరగతి చిన్నారి ఈ ప్రమాదంలో మృత్యువాత పడిరది. ఈ దారుణం నగరంలోని బాచుపల్లిలో జరిగింది. రోజులాగే ఆ పాప తండ్రి బైక్పై కూతురును స్కూలుకు తీసుకెళుతున్నాడు. ఇటీవలి వర్షాలకు రోడ్డంతా గుంతలమయం కావడంతో జాగ్రత్తగా వెళుతున్నాడు. రెడ్డీస్ ల్యాబ్ సమీపంలో బైక్ ఓ గుంతలో నుంచి వెళ్లడంతో పాప ఎగిరి కిందపడిరది. బైక్ వెనకాలే వస్తున్న స్కూల్ బస్సు ఒకటి పాప పై నుంచి వెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.