చెన్నై, న్యూస్‌లీడర్, ఆగస్టు 2 : సూపర్‌స్టార్ రజనీకాంత్ ఏం చేసినా సంచలనమే! స్టైల్‌కి కేరాఫ్ అడ్రస్‌గా చెబుతుంటారు ఆయన అభిమానులు. తాజాగా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ రేంజ్, క్రేజ్ తెలిసేలా ఓ సంఘటన జరిగింది.
రజనీకాంత్ తాజాగా నటించిన చిత్రం ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా…తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీనికి సంబంధించి 1000 పాసులు అభిమానులకు ఉచితంగా ఇస్తామని, అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది నిర్మాణ సంస్థ. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసిన 15 సెకెన్లలో మొత్తం పాస్‌లు ఫ్యాన్స్ క్లైమ్ చేసుకున్నారని మేకర్స్ తెలియజేశారు. దీంతో ‘ఇదీ తలైవా రేంజ్’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.