ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఏకంగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మొదటి చిత్రం ఇచ్చిన సక్సెస్ కారణంగా పుష్ప 2కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ ఫస్ట్ లుక్ ని దేశ వ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ వచ్చింది. సినిమా ఆడియో రైట్స్ కూడా భారీ ధర చెల్లించి టి-సిరీస్ సొంతం చేసుకుంది. డిజిటల్ రైట్స్ కోసం కూడా గట్టి పోటీ ఉంది. 150 కోట్ల వరకు డిజిటల్ హక్కుల కోసం చెల్లించేందుకు ప్రముఖ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని టాక్. ఇదిలా ఉంటే పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీచేయనున్నారు. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండనుంది. ఇప్పటి వరకు త్రివిక్రమ్ టచ్ చేయని జోనర్ లో అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా ఉంటుందం