అమెరికా నుంచి కేరళకు వచ్చిన ఓ మహిళ సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు..కొల్లంలోని ఓ ఆశ్రమానికి జులై 22న వచ్చిన 44 ఏళ్ల అమెరికా మహిళ జులై 31న ఒంటరిగా సమీపంలోని సముద్రపు ఒడ్డున సేద తీరుతున్నారు.
ఆ సమయంలో అక్కడికి చేరిన ఇద్దరు వ్యక్తులు ఆమెకు సిగరెట్‌ను ఇవ్వజూపారు. ఆమె దానిని తిరస్కరించడంతో మద్యాన్ని(రమ్) తీసుకోవాలని కోరారు. అందుకు అంగీకరించిన ఆమె దాన్ని తీసుకున్నాక మత్తులోకి జారుకున్నారు.
అదే అదనుగా ఆ వ్యక్తులు ఆమెను బైక్‌పై సమీపంలోని ఖాళీ ఇంటిలోకి తీసుకుపోయారు. ఆపై వారిద్దరూ ఆమెపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ సంఘటనపై బాధిత మహిళ ఈ నెల 1వ తేదీ రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.