జూలై 2023 అడ్మిషన్ల గడువు ఆగస్ట్ 10 వరకు ఆన్లైన్ విధానంలో ఆడ్మిషన్లు
విశాఖపట్నం, న్యూస్లీడర్, ఆగస్టు 3: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో)లో జూలై 2023 విద్యాసంవత్సరానికి గానూ వివిధ దూరవిద్యా కోర్సులతోపాటూ ఆన్లైన్ కోర్సులలో ప్రవేశాలకోసం గడువును ఆగస్ట్ 10వ తేదీ వరకూ పెంచింది. విశ్వ విద్యాలయం అందిస్తోన్న అన్ని సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, అన్ని పీజీ కోర్సులలో ప్రవేశాలు ఆగస్ట్ 10 వరకూ లభిస్తాయి. ఈ విద్యా సంవత్సరానికి గానూ ఇగ్నో అనేక రంగాలలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచే కొత్త కోర్సులను ఇగ్నో అందిస్తోంది. ఈ అడ్మిషన్లు ఆన్ లైన్ ద్వారా పొందవలసి ఉంటుంది. ఇగ్నో వెబ్సైట్ లో ఉన్న అడ్మిషన్ల లింక్ ద్వారా లేదా www.ignou.ac.in లింక్ ద్వారా అడ్మిషన్లు పొందవచ్చు. అన్ని కోర్సులలో ప్రవేశాలకు ఈ నెల 10వ తేదీ గడువు. విశాఖపట్నం ప్రాంతీయకేంద్రం పరిధిలోని 11 జిల్లాల్లో ఉన్న అధ్యయన కేంద్రాలన్నిటిలో ఈ విద్యా సంవత్సరానికిగానూ ప్రవేశాలు పొందే వీలుంది. ప్రవేశాలన్నీ ఆన్లైన్ విధానంద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫీజులు కూడా ఆన్లైన్ ద్వారానే కట్టాల్సి ఉంటుంది. ఎంపిక చేసిన కోర్సులలో ఎస్ సి., ఎస్.టి. విద్యార్ధులకోసం పూర్తి ఫీజు రాయితీకూడా విశ్వవిద్యాలయం కల్పిస్తోంది. మరిన్ని వివరాలకోసం ఇగ్నో వెబ్సైట్ చూడవచ్చు లేదా ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని ఈమెయిలు ద్వారా సంప్రదించవచ్చునని ఇగ్నో ప్రాంతీయ సంచాలకులు డా. గోనిపాటి ధర్మారావు తెలిపారు.