పెంపుడు జంతువులు, పక్షులతో తమకున్న అనుబంధానికి సంబంధించిన వీడియోలను ఇటీవలి కాలంలో కొంతమంది సోషల్ మీడియాలో పంచుకోవడం చూస్తున్నాం. మధ్యప్రదేశ్లోని దమోహ్ జిల్లాకు చెందిన దీపక్ సోనీ కుటుంబం కథ వేరు. వీరి పెంపుడు చిలుక ఎటో ఎగిరిపోయింది.
ఆ చిలుక ఫొటోలతో పోస్టర్లు వేసి ఆచూకీ చెప్పినవారికి రూ.10 వేలు రివార్డు ఇస్తామని ప్రకటించారు. ఊరంతా పోస్టర్లు వేసి, ఆటోకు మైకులు పెట్టి మరీ ఈ విషయం ప్రచారం చేస్తున్నారు. నిజానికి చిలుక ఇలా పారిపోవడం ఇదేమీ తొలిసారి కాదు. కానీ.. ఆ చిలుకపై ఉన్న ప్రేమతో దాని యజమాని మళ్లీ తిరిగిరావాలని వెంపర్లాడుతున్నాడు.
‘గత నెలలో ఒకసారి ఇలాగే ఎగిరిపోయి మళ్లీ దానంతటదే ఇంటికి తిరిగొచ్చింది. ఇప్పుడు మళ్లీ ఎగిరిపోయింది. ఇప్పటిదాకా రాలేదు. అది సరిగా ఎగరలేకపోతోంది. వీధికుక్కలు ఏమైనా హాని చేశాయేమోనని భయపడుతున్నాం. ఆ చిలుక అంటే మా కుటుంబానికి ఎంతో ఇష్టం’’ అని దీపక్ సోనీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చిలుక పోస్టర్లు వైరల్గా మారాయి.