మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ లో దూకుడు పెంచుతోన్న సంగతి తెలిసిందే. ‘సీతా రామం’ విజయం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నా… ఇన్నోవేటివ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికే ఈ గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే వరుసగా రెండు ప్రాజెక్ట్ లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాకి కమిట్ అయ్యాడు. దీంతో పాటు రానా నిర్మాణంలో ‘కాంత’ సినిమాకి సైన్ చేసాడు. ఫేమస్ గాయకుల ఆట షురూ! ఈ రెండు సినిమాలు ఏక కాలంలో సెట్స్ కి వెళ్తాయా? ఒక దాన్ని పూర్తిచేసిన తర్వాత మరోకటి వెళ్తుందా? అన్నది పక్కనబెడితే లక్కీ భాస్కర్ పనులు మాత్రం వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలో దుల్కర్ కి జోడీగా యంగ్ బ్యూటీ సాక్షి వైద్యని ఎంపిక చేసారు. ఈ అమ్మడు ఏజెంట్ సినిమాతో పరి చయమైన సంగతి తెలిసిందే. కానీ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా కొత్త సినిమా లు షురూ చేస్తోందీ భామ. ఇప్పటికే సాయితేజ్ తో ఓ సినిమా..మాస్ మహారాజ్ రవితేజతో మరో సినిమాకి సైన్ చేసింది. ఈ రెండిరటి తర్వాత వెంటనే దుల్కర్ సినిమాలోనూ లాక్ అవ్వడం ఆశ్చర్య పరిచే విషయమే. అంతకు ముందే వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’కి సైన్ చేసింది. – ఆగస్టు మీద ఎన్ని ఆశలో.. ప్రస్తుతం ఆ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఏజెంట్ బ్యూటీ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం లైనప్ లో ఉన్న సినిమాలు విజయాలు అందుకుంటే సాక్షి స్టార్ లీగ్ లో చేరడానికి పెద్దగా సమయం పట్టదనిపిస్తోంది. అలాగే టాలీవుడ్ లో కూడా కల్చర్ మారినట్లు కనిపిస్తోంది. కొత్త భామల్ని ఎంకరేజ్ చేసే దర్శక-నిర్మాతలు పెరిగారు. గత ట్రాక్ చూడకుండా అందం..అభినయం గల నాయిక అయితే అవకాశాలివ్వడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ఆ కోవలోనే సాక్షి ఛాన్సులందుకుంటుంది.