చట్టాన్ని అనుసరించాలని
హైకోర్టు ఆదేశం
విశాఖపట్నం, న్యూస్లీడర్, ఆగస్టు 3: జగదాంబ నుంచి విక్టోరియా జంక్షన్ వరకూ రోడ్డు విస్తరణ కోసం జీవీఎంసీ అనుసరిస్తున్న వైఖరిని హైకోర్టు తప్పు పట్టింది. న్యాయ పరంగా నష్ట పరిహారం చెల్లించే ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ కూల్చడాలు చేయరాదని హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో శిధిలావస్థలో వున్నాయంటూ భవనాలను కూల్చే విషయంలో కూడా చట్టాన్ని అనుసరించాలని కోర్ట్ ఆదేశించింది.జీవీఎంసీ కమీషనర్ సాయి శ్రీకాంత వర్మ మొండి పట్టుదల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిరది. తమకు చట్టపరమైన నష్ట పరిహారం ఇస్తే తామంతట తామే రోడ్డు విస్తరణ కు అవసరం అయిన స్థలాన్ని ఇస్తామని బాధితులు విన్నవించుకున్నారు. అయినా కమీషనర్ వినిపించుకోలేదు. పైగా టీడిఆర్ లకు తాము ఆమోదిస్తున్నాము అంటూ బాధితుల దగ్గర బలవంతపు సంతకాలు తీసుకున్నారు. ప్రతి రోజూ బుల్డ్రోజర్లు తీసుకెళ్లి భయ పించారు. అంతేకాదు, వారి వ్యాపారం జరక్కుండా ఫుట్ పాత్ లను తొలగించారు. ఈ పరిస్థి తుల్లో వేరే దిక్కు లేక బాధితులు హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కృష్ణమోహన్ తీర్పు ను వెలువరించారు. బాధితుల నుంచి వ్యక్తిగతంగా వారి పత్రాలను పరిశీలించాలని, వారి వాదనలు వినేందుకు అవకాశం ఇవ్వాలని, ఇదంతా రెండు వారాల్లో పూర్తి చేయాలని కోర్ట్ ఆదేశించింది. పత్రాల పరిశీలన జరిగాక ఎనిమిది వారాల లోగా చట్ట ప్రకారం సరైన నిర్ణ యం తీసుకోవాలని కోర్టు వెల్లడిరచింది. ఈ విచారణ పెండిరగ్లో ఉండగా ఎటువంటి కూల్చి వేతలూ చేయడానికి వీలు లేదని కోర్ట్ స్పష్టం చేసింది. ఇప్పటికే అభ్యంతరం లేదని రాసి ఇచ్చిన వారి విషయంలో కూడా జీవీఎంసీ చట్టాన్ని అనుసరించాలని ఆదేశించింది. అదే సమయంలో శిధిలావస్థలో వున్నాయన్న నెపంతో కూల్చివేతలు చేయాలన్నా చట్టాన్ని అనుసరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.