విశాఖపట్నం, న్యూస్లీడర్, ఆగస్టు 3: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర విశాఖ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు విశాఖ నగరంలో వారాహి యాత్రకు సిద్ధమవుతున్నారు. యాత్ర షెడ్యూల్ను జనసేన పార్టీ వర్గాలు విడుదల చేశాయి. విశాఖ సిటీలో పవన్ కల్యాణ్ రెండు బహిరంగ సభలు నిర్వహిస్తారు. పది రోజుల పాటు జరిగే ఈ యాత్రలో బహిరంగ సభలతో పాటు జనవాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారు. నియోజకవర్గాల నాయకులను కలిసి స్థానిక రాజకీయ పరిస్థితులపై జనసేనాధిపతి మాట్లడడమే కాకుండా ముఖ్యమైన ప్రదేశాల్లో పవన్ పర్యటించనున్నారు.