న్యూఢిల్లీ, న్యూస్‌లీడర్, ఆగస్టు 3: సమైక్యతతో ముందుకు సాగి మన బలాన్ని ప్రపంచానికి చాటి చెబుదామని కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా పిలుపునిచ్చారు. ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన హెల్త్‌కేర్ సమ్మిట్ సిరీస్’ని ప్రారంభించారు. న్యూ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థూల ఉత్పత్తిలో దాదాపు 80 శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడిరట రెండు వంతులు, ప్రపంచ భూభాగంలో 60 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థల సమష్టి బలాన్ని ఉపయోగించుకోవడమే మన ముందు లక్ష్యమని అన్నారు. ప్రధాన మంత్రి, నరేంద్ర మోడీ నాయకత్వంలో నిర్వహిస్తున్న జీ 20 సమ్మిట్ సిరీస్ ప్రపంచ ప్రమాణాన్ని నెలకొల్పడానికి సిద్ధంగా ఉందన్నారు. దేశాలలోని డైనమిక్ నగరాల్లో అందుబాటులో ఉన్న ఆరోగ్య సంరక్షణ, క్లిష్టమైన అంశాలను హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తుందని, ప్రతి వ్యక్తికి ఈ లైఫ్లైన్లు చేరేలా చూడటం దృఢమైన కర్తవ్యం అని డాక్టర్ మన్సుఖ్ మాండవియా పేర్కొన్నారు. పల్సస్ గ్రూప్, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ డిజిటల్ మార్కెటింగ్‌లో అగ్రగామిగా ఉందన్నారు.
విజ్ఞాన భాగస్వామ్యం, సహకారం కోసం ఒక ప్రపంచ వేదికగా..
పల్సస్ గ్రూప్ సీఈఓ డాక్టర్ శ్రీనుబాబు గేదెల మాట్లాడుతూ శాస్త్రీయ, సాంకేతిక, వైద్య సాహిత్యాలను ప్రచురించడంలో, ఏటా 1000కి పైగా ప్రపంచ సమావేశాలను నిర్వహించడంలో పల్సస్ గ్రూప్ పునరంకితంగా పని చేస్తోందన్నారు. ‘విజ్ఞాన భాగస్వామ్యం, సహకారం కోసం ఒక ప్రపంచ వేదికగా, పండితులు, వైద్యులు, ఆవిష్కర్తలు, విధాన నిర్ణేతలను ఏకం చేయడం ద్వారా ఆరోగ్య సంరక్షణ పరివర్తన కోసం శక్తివంతమైన సినర్జీని పెంపొందించడానికి ఒక గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌గా ఏర్పడుతోందన్నారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ ఇది ప్రపంచ శ్రేయస్సు కోసం వాదిస్తుందని స్పష్టం చేశారు. హెల్త్20 చొరవలో భాగంగా, హెల్త్‌కేర్ సమ్మిట్ సిరీస్ ఫ్రాంక్ఫర్ట్, టోక్యో, టొరంటో, న్యూయార్క్, బీజింగ్, లండన్, వియన్నా, కేప్ టౌన్, రోమ్, పారిస్, రియాద్, బాలి, సావో పాలో, సియోల్ వంటి ప్రధాన నగరాల్లో జరగనుంది. ‘ఒక కుటుంబం, ఒకే భూమి’ సూత్రాన్ని నొక్కి చెబుతాయని అన్నారు. న్యాయవాది బెల్లాన చంద్ర శేఖర్ మాట్లాడుతూ గ్రామీణ ఆరోగ్య సంరక్షణ కోసం నొక్కి చెప్పారు. 2023 జూన్‌లో గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌లో ఒక మోడల్ హాస్పిటల్‌ను స్థాపించడం ద్వారా, భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో కూడా నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉందన్నారు.