విశాఖపట్నం-సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ రైళ్లను సామర్లకోట రైల్వేస్టేషన్లో గురువారం నుంచి నిలపనున్నారు. ఇటీవల ప్రయాణికుల నుంచి భారీగా వచ్చిన వినతుల మేరకు హాల్టింగ్ సదుపాయం కల్పించారని స్టేషన్ మేనేజర్ ఎం.రమేష్ తెలిపారు.
కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ఇటీవల రైల్వే శాఖ మంత్రితో పాటు పలువురు ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు ఇవ్వడంతో స్థానికంగా ఒక నిముషం పాటు రైలును ఆపేందుకు అనుమతులు జారీ చేశారని వివరించారు.
విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే (20833) రైలు సామర్లకోటకు ఉదయం 7.14 గంటలకు వచ్చి 7.15 గంటలకు బయలుదేరుతుందని చెప్పారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే (20834) రైలు సామర్లకోటకు రాత్రి 9.34 గంటలకు చేరుకుని 9.35 గంటలకు వెళ్తుందన్నారు.