ఓకే బంగారం- సీతారామం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో టాలీవుడ్ లోను దుల్కర్ సల్మాన్ అసాధారణ మార్కెట్ ను అందుకున్నాడు. మాలీవుడ్ నుంచి మోహన్ లాల్- మమ్ముట్టి వంటి స్టార్లకు తెలుగు ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ఉంది. ఆ తర్వాతి జనరేషన్లో పృథ్వీరాజ్ సుకుమారన్.. ఫహద్ ఫాజిల్ వంటి వారికి టాలీవుడ్ లో ప్రాధా న్యత పెరిగింది. కానీ నేటి జనరేష న్ నుంచి ఎవరు అంత ప్రభావ వంతమైన మాలీవుడ్ స్టార్ అని ప్రశ్నిస్తే .. దుల్కర్ సల్మాన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అతడు ఇటీవల నెమ్మదిగా టాలీవుడ్ పైనా గ్రిప్ పెంచుకున్నాడు. మార్కెట్ ఉన్న హీరోగా పాపులరయ్యాడు. మునుముందు కోలీవుడ్- శాండల్‌వుడ్- బాలీవుడ్ లోను గ్రిప్ పెంచుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ప్రస్తుతం దుల్కర్ ‘కింగ్ ఆఫ్ కోతా’ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతానని నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమాని భారతదేశంలో అత్యంత భారీగా విడుదల చేయాలేది దుల్కర్ టీమ్ ప్లాన్. కేవలం కేరళలోనే 500ం స్క్రీన్ లలో రిలీజ్ చేస్తున్నారు. అలాగే 7 ఎ.ఎం. ఫస్ట్ షోతో కేరళలో ఘనంగా ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబం ధించిన అడ్వాన్స్ బుకింగ్‌లు విడుదలకు మూడు వారాల ముందే కేరళలో ప్రారంభ మయ్యాయి. విడుదల రోజున కేరళలోని మెజారిటీ థియేటర్లలో కెఒకె మొదటి షో ఉదయం 7 గంటలకు షెడ్యూల్ అవుతుంది.