సిడ్నీ, న్యూస్‌లీడర్, ఆగస్టు 4: భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పరాభవం ఎదురైంది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్ 12 ర్యాంకర్, అమెరికా క్రీడాకారిణి బీవెన్ జాంగ్ చేతిలో ఓటమిపాలైంది. సూపర్ 500 టోర్నీ అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నాలుగోసారి సెమీస్‌కు చేరుతానని భావించిన సింధుపై.. బీవెన్ జాంగ్ 21-12, 21-17 తేడాతో విజయం సాధించింది. కాగా, ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లలో బీవెన్తో తలపడిన సింధు ఆరు విజయాలను నమోదు చేసింది. ఈసారి మాత్రం ఓటమి చెందింది. కాగా, గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో అయిదో సీడ్ సింధు 21-14, 21-10తో ఆకర్షి కశ్యప్‌పై గెలుపొందింది. ప్రిక్వార్టర్స్‌లో 39 నిమిషాల్లో ఆకర్షిని ఓడిరచిన సింధు.. క్వార్టర్ ఫైనల్స్‌లో బీవెన్పై మాత్రం పైచేయి సాధించలేకపోయింది. వరుసగా రెండు సెట్లను కోల్పోయి కేవలం 39 నిమిషాల్లోనే ఓటమి పాలైంది.