సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం జైలర్ మూవీతో ప్రేక్షకుల ముందుకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్‌కి సిద్ధమైంది. నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ ట్రైలర్ కంప్లీట్ యాక్షన్ మోడ్‌లో ఉంది. రజినీకాంత్ క్యారెక్టర్ కి ఒక ఫ్యామిలీ మెన్‌గా చూపిస్తూనే అందులో వేరి యేషన్స్ ప్రెజెంట్ చేశారు. ఈ చిత్రం రిలీజ్ తర్వాత రజినీకాంత్ జై భీమ్ ఫేం టీజే జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నారు. సామాజిక ఇతివృత్తంతోనే ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. మూవీలో ఓ కీలక పాత్ర కోసం నేచురల్ స్టార్ నానిని ఎంపిక చేసారంట. అతను అయితే పెర్ఫెక్ట్గా ఉంటుందని భావించి నానిని సంప్రదించి కథ చెప్పడం జరిగిందని టాక్. సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి చేసే ఛాన్స్ రావడంతో నాని కూడా ఒప్పుకున్నారంట. అమితాబచ్చన్ ఈ చిత్రం ద్వారా కోలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాని పాత్ర నిడివి 20 నిమిషాలు మాత్రమే ఉంటుందంట. అయిన కాని ఆ రోల్ కోసం ఏకంగా 10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అడిగారంట. నిర్మాత కూడా అంత మొత్తం ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. దసరా సినిమాకి 15 కోట్ల వరకు తీసుకు న్నారు. దసరా మూవీ సూపర్ సక్సెస్ అయిన హాయ్ నాన్న సినిమా ముందుగానే కమిట్ అవ్వడం వలన అంతే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు తన డిమాండ్, మార్కెట్ వేల్యూ పెరగడంతో సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా అయిన కూడా 10 కోట్ల వరకు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. నాని ఇప్పటికే తమిళంలో రెండు సినిమాలలో నటించి అక్కడి ప్రేక్షకులకి చేరువ అయ్యారు. దసరాకి ముందు ఒక్కో సినిమాకి నాని ఎంత రెమ్యునరేషన్ తీసు కునేవాడో రజినీ కాంత్ చిత్రంలో 20 నిమిషాల నిడివి పాత్రకి అంతే తీసు కుంటూ ఉండ టం ఇప్పుడు ఆసక్తికరంగా మా రింది.