జాతి రత్నాలు సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న నవీన్ పోలిశెట్టికి ఆ తర్వాత ఎన్నో రకాల ఆఫర్స్ అయితే వచ్చాయి. అయితే అతను ఎక్కడా కూడా తొందరపడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాల తోనే రావాలి అని ఫిక్స్ అయ్యాడు. మధ్యలో దిల్ రాజు కూడా అతనికి ఒక ఆఫర్ చేసినప్పటికీ కూడా టెంప్ట్ కాలేదు. ఇక యూవీ క్రియేషన్స్ నుంచి వచ్చిన ఆఫర్‌కు మాత్రం అతను ఎంతో నమ్మకంగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాడు. పి.మహేష్‌బాబు దర్శకత్వంలో మిస్ శెట్టి మిస్టర్ పోలీస్ శెట్టి అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. అయితే యూవీ క్రియేషన్స్ ఈ సినిమా ను మంచి నిర్మాణం విలువలతోనే నిర్మించింది. కానీ ప్రమోషన్స్ విషయం లో మాత్రం నిర్మాణ సంస్థ మరోసారి దారుణంగా ఫెయిల్ అవుతూనే ఉంది. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన అఫీషియల్ రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అసలు అయితే ఆగస్టు మొదటి వారంలోనే సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. ఇక ముందుగానే హీరో నవీన్ పోలిశెట్టి కూడా ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు. కానీ ఆ తర్వాత మళ్లీ కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనుల వలన వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.