పెంపుడు జంతువులపై చాలా మంది ప్రేమ కురిపిస్తుంటారు. వాటికేమైనా అయితే విలవిల్లాడుతుంటారు. వీరు కూడా అదే కోవకు చెందినవారు! పిల్లి తప్పిపోవడాన్ని జీర్ణించుకోలేని వారు.. దాన్ని పట్టి తీసుకురావడానికి ఏకంగా రివార్డునే ప్రకటించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన పర్వేజ్ కుటుంబ సభ్యులు నాలుగేళ్లుగా ఓ పిల్లిని (ఫ్లుప్ఫి) పెంచుకుంటున్నారు. నాలుగు నెలలుగా అది కనిపించడం లేదు. తమ పిల్లిని తీసుకొచ్చిన వారికి రూ.10 వేల బహుమానం ఇస్తామంటూ ఇలా ప్రధాన కూడళ్లలో పోస్టర్లు అతికించారు.