వెస్టిండీస్ గడ్డపై తొలి టీ20లో భారత్‌కి చేదు అనుభవం ఎదురైంది. గురువారం అర్ధరాత్రి ముగిసిన తొలి టీ20 మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీమ్ 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఆ జట్టులో నికోలస్ పూరన్ (41: 34 బంతుల్లో 2×4, 2×6), రోవ్‌మెన్ పోవెల్ (48: 32 బంతుల్లో 3×4, 3×6) టాప్ స్కోరర్లు నిలిచారు. భారత్ బౌలర్లలో చాహల్, అర్షదీప్ సింగ్ చెరో రెండేసి వికెట్లు పడగొట్టారు.
150 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ జట్టు దూకుడుగా ఆడబోయి బోల్తాపడింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తదితర సీనియర్లు టీమ్‌లో లేరు. దాంతో.. కుర్రాలైన ఇషాన్ కిషన్ (6), శుభమన్ గిల్ (3) ఫస్ట్‌లోనే ఔటైపోగా.. సూర్యకుమార్ యాదవ్ (21), కెప్టెన్ హార్దిక్ పాండ్య (19) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఈ దశలో తెలుగు క్రికెటర్, హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ (39: 22 బంతుల్లో 2×4, 3×6) భారీ సిక్సర్లతో భారత్‌లో గెలుపు ఆశలు రేపాడు.
Takes a blinder.
Hits back to back sixes to kick off his innings.
A dashing debut for Tilak Varma 😎#INDvWIAdFreeonFanCode #WIvIND pic.twitter.com/VpcKOyfMSR— FanCode (@FanCode) August 3, 2023
భారత్ తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న తిలక్ వర్మ.. మొదటి మూడు బంతుల్లోనే 2 సిక్సర్లు కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. కానీ.. టీమ్ స్కోరు 77 వద్ద తిలక్ ఔటైపోగా.. ఆ తర్వాత ఒత్తిడికి గురైన భారత్ చివరికి 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులే చేయగలిగింది.