న్యూఢిల్లీ, న్యూస్లీడర్, ఆగస్టు 4 : ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మణిపూర్ అల్లర్ల అంశంతో ఉభయ సభల కార్యకలాపాలు వాయిదా పడుతున్నాయి. శుక్రవారం కూడా అదే పరిస్థితి ఎదురైంది. తాజాగా రెండు సభలు మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా పడ్డాయి. విపక్షాలు మణిపుర్ ఉద్రిక్తతలు, అక్కడ మహిళలపై జరిగిన ఘోరాలపై చర్చించాలని పట్టుబడుతుండా.. రాజస్థాన్లో స్త్రీలపై జరుగుతోన్న దారుణాలపై చర్చించాలని రాజ్యసభాపక్ష నేత పీయూష్ గోయల్ కోరారు. రూల్ 176 కింద ఈ చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సభలో గందరగోళం ఏర్పడిరది.