` 5న సాయంత్రం భూ కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి.. ` రాత్రి 7 గంటల సమయంలో కీలక ఘట్టం ` అంతా సవ్యంగా జరిగితే ఈ నెల 23న చంద్రుడిపై దిగనున్న విక్రమ్ ల్యాండర్
శ్రీహరికోట, న్యూస్‌లీడర్, ఆగస్టు 5 : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌కు సంబంధించి శనివారం కీలక ఘట్టం చోటు చేసుకోబోతోంది. భూ కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3 ప్రవేశించబోతోంది. ఇప్పటికే చంద్రుడి దిశగా చంద్రయాన్-3 చాలా దూరం ప్రయాణించింది. ఈ రాత్రి 7 గంటల సమయంలో ఇది చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుందని ఇస్రో వెల్లడిరచింది.
అంతా సవ్యంగా జరిగితే ఈ నెల 23న చంద్రుడి ఉపరితలం పైకి స్పేస్ క్రాఫ్ట్‌లోని విక్రమ్ ల్యాండర్ దిగుతుంది. చంద్రుడిపై దిగే క్రమంలో విక్రమ్ ల్యాండర్ సొంతంగా నిర్ణయాలను తీసుకోగలదని ఇస్రో తెలిపింది. చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్‌కు, చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్‌కు ఇదే ప్రధానమైన తేడా అని చెప్పింది.
గతంలో చంద్రయాన్-2 మిషన్ ల్యాండిరగ్ అయ్యే సమయంలో చంద్రుడి ఉపరితలాన్ని ల్యాండర్ బలంగా ఢీకొంది. దీంతో విక్రమ్ ల్యాండర్‌లోని వ్యవస్థలు పని చేయకుండా పోయాయి. ఇప్పుడు ల్యాండర్‌ను మరింత అభివృద్ధి చేసి చంద్రుడి మీదకు పంపారు.