` ధరల అదుపునకు చక్కని సూత్రం ` జపనీయుల అనుసరించే మార్గమిది
విశాఖపట్నం, న్యూస్‌లీడర్, ఆగస్టు 5 : జపనీయులకు ఓ అలవాటు ఉంది. మార్కెట్లో ఏదైనా వస్తువు ధర అధికమైనపుడు కొన్నాళ్ల పాటు ఆ వస్తువు కొనడం లేదా పదార్థాలను తినడం మానేస్తారు. దీనివల్ల ఆ సరుకు ధరకు డిమాండ్ తగ్గి ధరలు అందుబాటులోకి వస్తాయి. ఈ మార్కెట్ సూత్రాన్ని వారు అనుసరించడం ద్వారా ధరలను కొంతవరకు అదుపులో ఉంచగలుగుతారు.
ప్రస్తుతం టమాటా ధర చుక్కలకు తాకుతున్న తరుణంలో మనం కూడా జపనీయుల సూత్రాన్ని పాటిస్తే సరి. అంటే.. ‘నో టమాటా వీక్’ (ఈ వారం టమాటాకు దూరం) పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
నిజానికి టమాటా ధరలు పెరగడం వల్ల రైతుల కంటే మధ్యవర్తులు, మార్కెట్‌ను శాసించే దళారులే అధికంగా ప్రయోజనం పొందుతున్నారు. మనం ‘నో టమాటా వీక్’ పాటిస్తే అలాంటి వారికి చెక్ పెట్టినట్టవుతుంది కూడా. అందుకే ఓ వారం రోజులు ‘టమాటాకు దూరంగా ఉందాం’ అన్న స్లోగన్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇందులో నిజం కూడా ఉంది.