గద్దర్… ఆయన జీవిత కాలంలో ముప్పావు సగం ప్రభుత్వంతో, పోలీసులతోనే పోరాటం చేశారు. ఆయన అజ్ఞాతంలో ఉండే సమయంలో తుపాకీలన్నీ ఆయనపైనే గురి. బయటకు వచ్చిన తరువాత కూడా ఆ గళ గర్జన వినిపించకుండా అడ్డంకులు, అరెస్టులు. చివరకు అవే తుపాకులు వేరే వేషాల్లో వచ్చి ఆయనపై పేలాయి. చనిపోయాడని వదిలేశాయి. రక్తపు మడుగులో పడిపోయిన ఆయన్ని ఢల్లీిలోని ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించగా ఆపరేషన్లు చేసి బతికించారు. ‘నీ పాటనై వస్తున్నాను’ అంటూ ఢల్లీి గడ్డపైనుంచే రాగం అందుకున్నారు. కానీ విచిత్రం…అవే తుపాకులు ఆయన భౌతిక దేహం చుట్టూ పైకిలేచి పేలి గౌరవ వందనం అర్పించాయి. ఆయన అంత్యక్రియలను పోలీసు
. ప్రజా సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలో పార్థివదేహం
. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన అంతిమయాత్ర
హైదరాబాద్, న్యూస్‌లీడర్, ఆగస్టు 7: ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ప్రజా గాయకుడు, రచయిత అంత్యక్రియలు వేలాది ప్రజల మధ్య సోమవారంఅధికారిక లాంఛనాలతో నిర్వహించారు మధ్యాహ్నం 12 గంటలకు గద్దర్ అంతిమయాత్ర ఎల్బీ స్టేడియం నుంచి అశేష జనవాహిని మధ్య సాగింది. ఎల్బీ స్టేడియం నుంచి తొలుత గన్ పార్క్‌కు గద్దర్ పార్థివదేహాన్ని తీసుకెళ్లారు. అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం, ట్యాంక్ బండ్ మీదుగా అల్వాల్‌లోని ఆయన ఇంటి వరకు యాత్ర కొనసాగింది. గద్దర్ నివాసంలో ఆయన భౌతికకాయాన్ని కాసేపు ఉంచారు. అల్వాల్ భూదేవి నగర్‌లోని మహాభోది విద్యాలయం ఆవరణలో గద్దర్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేయగా విద్యాలయంలోని మైదానం వెనకాల సమాధి కోసం చేస్తున్న ఏర్పాట్లను గద్దర్ కూతురు వెన్నెల దగ్గరుండి పర్యవేక్షించారు. ఏర్పాట్లను డీసీపీ సందీప్‌రావు పరిశీలించారు. ఈ యాత్రలో కళాకారులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. అంతిమ యాత్ర సందర్భంగా పోలీసులు అల్వాల్ భూదేవినగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు. అంతిమ యాత్ర వాహనానికి జై భీం జెండాలతోపాటు బుద్ధుడి పంచశీల జెండాలను జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేశారు.